వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనని వర్గాల ప్రజల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో 176వ రోజు కొనసాగుతోంది. జగన్ తమ సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్నాడని తెలుసుకున్న ప్రజలు అశేషంగా తరలి వస్తున్నారు. వారి వారి సమస్యలను జగన్‌కు తెలుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే తమపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారంటూ జగన్‌కు చెప్పుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే, వైఎస్ జగన్ మాత్రం ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. వారిలో వైకాపా మీకు అండగా ఉంటుందన్న భరోసాను కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
అయితే, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఇవాళ జగన్ 176వ రోజు పాదయాత్ర కొనసాగించారు. ఈ క్రమంలోనే మొగల్తూరుకు చెందిన మద్దూరి నిర్మలా కుమారి అనే మహిళ తన మూడేళ్ల చిన్నారిని జగన్ వద్దకు తీసుకొచ్చి పేరు పెట్టాలని కోరింది. ఆ వెంటనే జగన్ ఆ పాపకు విజయమ్మ అని నామకరణం చేశారు. విజయమ్మా అంటూ మూడు పిలిచాడు. దీంతో ఆ పాప చిరునవ్వు చిందించింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.