ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మార్గాన్ని అన్వేషిస్తూ చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రం అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ జగన్ తన పాదయాత్రను పశ్చిమ గోదావరి ప్రజల ఆదరాభిమానాల నడుమ.. వారి సమస్యలు తెలుసుకుంటూ కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పశ్చిమగోదావరి జిల్లా సరిపల్లి దళితులు వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతీ దళితుడికి సొంత ఇల్లు ఉండేందుకు, అందుకు అనుగుణంగా వైఎస్ఆర్ ప్రణాళికలు రచించారన్నారు. అందులో భాగంగానే సరిపల్లి దళితులకు పది పక్కా ఇల్లులు మంజూరు చేశారని తెలిపారు. ఆ దివంగత నేత ఉన్నప్పుడే బేస్‌మట్టం వేయడం జరిగిందన్నారు.అయితే, ఆ నేత ఎప్పుడైతే హఠాణ్మరణం చెందారో.. అప్పట్నుంచి తమను పట్టించుకునే వారు లేకుండా పోయారని సరిపల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు సరిపల్లి దళితులు తెలిపారు.