ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీని మళ్లీ కలవనున్నారా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ, ప్రత్యేక హోదాను సాధిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఏపీకి అన్యాయం చేసి.. చివరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుని.. విడిపోతున్నామంటూ ఏపీ ప్రజలను నట్టేట ముంచిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఏపీ ప్రజలు మరువకముందే సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ మళ్లీ కలవనున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 16వ తేదీన ప్రధాని మోడీతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి అయోగ్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే, నీతిఅయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏకాంత భేటీ కానున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది.