ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ అని, తమ కార్యకర్తలు త్యాగాలకు మారుపేరని పేర్కొన్నారు. అవినీతి అంటూ ఆరోపణలు చేసేవారికి సాక్ష్యాలతో తగిన సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే దీనిపై వైసీపీ నేతలు ప్రజలకు తెలుసు మీరు ఎన్ని కుట్రలు చేశారో.. మహిళలపై ఎలా దాడులు చేశారో వచ్చే ఎన్నికల్లో మీకు ఘోర పరాజయం తప్పదు అంటున్నారు.
