ఆధునిక సాంకేతక యుగంలో టీవీ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా స్మార్ట్ ఫోన్ నేటి మానవ దైనందిన జీవితంలో భాగమై పోయింది .అయితే స్మార్ట్ ఫోన్ ఉంటె సరిపోదు.దాన్ని తగిన జాగ్రత్తలతో వాడుకోవాలి .లేకపోతె అది కింద పది స్క్రీన్ పాడవుతుంది .లేదా నీటిలో పడి దేనికి పనికి రాకుండా పోతుంది.అయితే స్క్రీన్ పగిలితే మరల కొత్త స్క్రీన్ వేయించవచ్చు కానీ నీళ్ళల్లో పడితేనే అసలు సమస్య .అయితే నీటిలో పడగానే స్మార్ట్ ఫోన్ ను ఏమి చేయాలంటే ..!ఉన్నట్టు ఉండి స్మార్ట్ ఫోన్ నీటిలో పడగానే వెంటనే తమకు ఏదో తెల్సినట్లుగా మొబైల్ ను బయటకు తీసి అనవసర ప్రయోగాలన్నీ చేస్తారు .
అలా చేయకుండా మొబైల్ తీసిన తర్వాత అది ఆన్ లో ఉందా ..లేదా స్విచ్ ఆఫ్ అయిందా అనేది చూడాలి .ఒకవేళ మొబైల్ ఆన్ లో ఉంటె స్విచ్ ఆఫ్ చేయాలి .ఒకవేళ అప్పటికే అది స్విచ్ ఆఫ్ అయి ఉంటే ఆన్ చేయడం లేదా ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తే ఇక మీ ఫోను డమాల్ ..నీటిలో పడిన ఫోన్‌లోని ఏ ఫీచర్‌నూ ఉపయోగించకూడదు. పాటలు వినడం, వీడియోలు చూడటం, బ్రౌజింగ్ తదితరాలు. మీరు వాడుతున్నది ‘‘కీ ప్యాడ్ ఫోన్’’కావడంతో డివైస్ లోపలికి నీరు వెళ్లే అవకాశం ఉంది. ఒక వేళ బయటకు తీసే అవకాశమున్న ఫోన్ అయితే బ్యాటరీని బయటకు తీసి పొడి గుడ్డతో తుడవాలి.మెమొరీ కార్డ్, సిమ్‌కార్డ్‌లను ఫోన్ నుంచి తీసేయాలి.
అనంతరం మెత్తని పొడిగుడ్డతో ఒత్తాలి. డివైస్ లోపలికి నోటితో గాలి ఊదడం, బ్లో డ్రయర్‌లను ఉపయోగించి ఆరబెట్టడం లాంటివి చేయకూడదు. వీటివల్ల కూడా ఫోన్ లోపలికి నీరు వెళ్లిపోయే ప్రమాదముంది.చాలా మంది తడిసిన ఫోన్‌ను ఎండలో పెట్టడం లేదా చిన్నని సెగతో వెచ్చబెట్టడం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. దీనివల్ల ఫోన్ పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ. ఫోన్ భాగాలను వేరు చేయమన్నాం కదా అని..
వాటి మదర్‌బోర్డ్ తదితర కొన్ని సున్నితమైన విడిభాగాల జోలికి పోకూడదు.నీటిలో ఫోన్ పడిన వెంటనే పై జాగ్రత్తలతో పాటు మరో చిన్న పనిని ఇక్కడ చేయాలి. బ్యాటరీ తీసేసిన ఫోన్‌ను ఓ బియ్యం డబ్బాలో ఉంచి మూతపెట్టేయాలి. దాదాపు రెండు, మూడు రోజుల వరకు దాని జోలికి పోకూడదు. డబ్బాలోని బియ్యం వేడికి పోన్‌లోని తడి నెమ్మదిగా ఆరిపోతుంది. అంతేకాకుండా బియ్యానికి ఉన్న చిన్నపాటి పిండిలాంటి పదార్థం నీటిని క్రమేపీ పీల్చుకుంటుంది. అనంతరం మళ్లీ స్విచ్ ఆన్ చేస్తే దాదాపు పని చేసేస్తుంది. లేదంటే ఒక్కసారి మొబైల్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.