టీడీపీ, బీజేపీతో విభేదించిన పవన్ కళ్యాన్ పార్టీ నిర్మాణం కోసం జనంలోకి వెళ్లారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమైన పవన్ యాత్ర ప్రస్తుతం విజయనగరం బాడర్కు చేరింది. ఈ నేపథ్యంలోనే బాబాయ్ పిలిస్తే ప్రచారం చేసేందుకు నేను సిద్ధమంటూ రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే, రామ్చరణ్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తన కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎంతో సంతోషకర మైన జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటిది వారిని పిలిచేందుకు నేను సిద్ధంగా లేనంటూ పవన్ అన్నారు. రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, మా కుటుంబ సభ్యులు వారికై వారు స్వతహాగా వస్తే ఆహ్వానిస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.