లక్షల లక్షల రూపాయలు పెట్టి.. పెద్ద పెద్ద కార్పోరేట్ స్కూల్లో చదివిన విద్యార్ధులే కాదు..ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్ధులు కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది విద్యార్ధులు తమ ప్రతిభను చాటుగా..తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూతురు పదో తరగతి ఫలితాల్లో తన సత్తా చాటింది.ఈ రోజు గుజరాత్ సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్(GSHSEB) విడుదల చేసిన SSC ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్లో చదివిన ఓ ఆటో డ్రైవర్ కూతురు ఆఫ్రీన్ 99.31 శాతం సాధించింది. ఆహ్మదాబాద్‌లోని ఎఫ్డీ హైస్కూల్‌లో ఆఫ్రీన్ చదివింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయనుకున్నానని…టాప్ మార్కులు వస్తాయనుకోలేదని తెలిపింది .తన లక్ష్యం డాక్టర్ అని చెపింది.అందుకు సైన్స్ స్ట్రీమ్‌లో అడ్మిషన్ తీసుకుని…ఎలాగైనా డాక్టర్‌ని అవుతానని తెలిపింది. తన కూతురిని డాక్టర్ ను చేసి…ఆమె కలను నెరవేర్చుతానని ఆమె తండ్రి హమ్జా ఈ సందర్భంగా మీడియాకు తెలిపాడు.