పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వెంగలపూడి అనిత మరో సారి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఎంతలా అంటే.. ఇంతకు మునుపు మరెవ్వరూ తిట్టని విధదంగా అన్న మాట. అందుకు విజయవాడ కేంద్రంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమం వేదిక అయింది.
అయితే, మహానాడు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఒకవైపు సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుంటే.. మరో వైపు వైఎస్ జగన్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారన్నారు. జైలు పక్షి, స్కాముల వీరుడు, అవినీతికి అంబాసిడర్ జగన్ అంటూ అనిత విమర్శించారు. పాదయాత్ర ద్వారా ప్రతీ ఇంటికి వస్తున్న జగన్‌ను 16 నెలలు జైలుకు ఎందుకు పోయావని ప్రశ్నించండి అంటూ టీడీపీ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. జగన్ తన కేసుల మాఫీ కోసం మోడీ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవ చేశారు.