తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇటు ప్రజలనే కాకుండా అటు ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తున్నాయి .
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంపీపీ కే మల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డితోపాటు టీడీపీకి చెందిన ఐదు వందల కుటుంబాల వారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి మంత్రి తుమ్మల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..