అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ,మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆ తర్వాత ఆ మహానేత తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే వైసీపీ ఆవిర్భావ దినం నుండి గత సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీలో ఉన్న అయన ఆ తర్వాత కొన్ని కొన్ని కారణాల వలన ఆ పార్టీ నుండి బయటకొచ్చారు .
ఆ తర్వాత జనహితం అనే పేరిట ఉత్తరాంధ్ర కోసం పోరాడుతున్నారు .ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాడి పరిష్కరించడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు .తాజాగా ఇటీవల కేంద్రం ఉత్తరాంధ్ర ప్రాంతం లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు వందల కోట్ల యాభై రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇవ్వలేదని వెనక్కి తీసుకుంది .
అయితే ఈ నిధులను వెంటనే విడుదల అయ్యేలా చూడాలని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఏకంగా ఆయన లేఖ రాశారు .ప్రస్తుతం ఆయన రాసిన లేఖ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది .అయితే ఆయన వైసీపీ లో చేరతారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఇలా లేఖలతో మరోసారి సంచలనం సృష్టించడం పలు అనుమానాలకు తావిస్తుంది ..