Home / MOVIES / మరిదితో రొమాన్స్ సంగీత…లేచే సమయంలో మా అమ్మగారు

మరిదితో రొమాన్స్ సంగీత…లేచే సమయంలో మా అమ్మగారు

కృష్ణవంశి తీసిన చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలిచిన సినిమా‘ఖడ్గం’.ఈ చిత్రంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం. వీరితోపాటు నటి సంగీత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటీమణీ తాజాగా ఓ వివాదాస్పద చిత్రంపై స్పందించారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘ఉయుర్’ అనే తమిళ చిత్రం ద్వారా తనకు ఎక్కువ పేరు వచ్చిందని అయితే ఆ పాత్రను అయిష్టంగా చేశా అన్నారు సంగీత. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నాకూ నిర్మాతలకు మధ్య గొడవలు అయ్యాయి.

దీనికి కారణం ఈ చిత్రంలో నాది బోల్డ్ క్యారెక్టర్. చిత్రంలో ఓ మహిళ తన భర్తకు ఆహారంలో డ్రగ్స్‌ కలిపి ఇచ్చి.. తన మరిదితో కామ కోరికలు తీర్చుకుంటుంది. మొదట్లో ఆ క్యారెక్టర్ లో నేను నటించగలనా..అంత ధైర్యం చేయాలా అన్ని ఆలోచన వచ్చింది.. అయితే దర్శకుడు సామి నాకు కథ చెప్పినప్పుడు.. ఇది బోల్డ్ క్యారెక్టర్ కాబట్టి కాస్త ఎక్స్‌పోజ్ చేయాలన్నారు. నేను చేయనని చెప్పేశా. అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఉంటే నటిస్తానని చెప్పా. దర్శకుడితో పాటు నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు. మొత్తానికి ఎలాగోలా ఆ సినిమా విడుదలైంది. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నా కెరియర్‌‌కి బ్రేక్ ఇచ్చింది ‘ఉయర్’ చిత్రం. ఆ సినిమాను అమ్మతో కలిసి థియేటర్‌లో చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా.. మరిదితో రొమాన్స్ చేసే సీన్‌లు నా మనసుకు ఏ మాత్రం నచ్చలేదు. వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని లేచే సమయంలో మా అమ్మగారు ఇది సినిమా..కొన్ని క్యారెక్టర్స్ అలా చేయాల్సి వస్తుంది…అప్పుడే మంచి నటిగా గుర్తిస్తారు అని అన్నారు. ఆమె బలవంతంగా ఆ సినిమా పూర్తిగా చూడగలిగా. ఆ తరువాత ఆ సినిమా మళ్లీ ఎప్పుడూ చూడలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat