జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ప్రజా పోరాట యాత్ర మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా టౌన్‌లో చేపట్టిన నిరసన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మూడన్నర సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చింది టీడీపీ. మోసం చేసింది టీడీపీ. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దుల కొడుకు లోకేష్.. మా నాన్న వేసిన రోడ్లు మీదే నడుస్తున్నారంటున్నారు.. ఏం రోడ్లు మీ తాతల సొత్తా? లేదంటే మీ జేబుల్లోంచి డబ్బులు తీసి రోడ్లు వేయిస్తున్నారా? ప్రతిదానికి మేమే చేశాం.. మేమే చేశాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ల జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు చేసినట్లు ప్రసంగాలు చేస్తున్నారు. ఇది ప్రజల సొత్తు. ప్రజల కష్టం. ప్రజలు టాక్స్ కడితేనే డబ్బులు వస్తున్నాయి. ఈ కథలు ఎవరికి చెప్తున్నారు. ఇలాంటి కథలు పాత తరానికి చెప్పండి.. ఈ తరానికి కాదు.. కత్తులు దూసే యువతారానికి కాదు అంటూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు.