తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈరోజు విజయవాడలో జరుగుతోన్నమహానాడు సమావేశంలో ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజకోసం ఎంతో కష్టపడ్డారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. మీరు దేశానికి ప్రధానమంత్రి .రాష్ట్రానికి మంత్రి లోకేష్ సీఎం కావాలి అప్పుడే మేమంతా సంతోషిస్తాం అని వాఖ్యానించారు.
బాబు దూరదృష్టి ఉన్న నాయకుడు..ప్రత్యేక హోదా విషయంలో మోదీ చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని అయన తన ఆవేదన వ్యక్తం చేశారు.నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని అన్నారు.వైసీపీ అధినేత జగన్‌కు అన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయని ..ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారని మహానాడులో జేసీ చెప్పారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని.. ఏడు అడుగుల లోతులో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూడ్చిపెట్టారని చెప్పారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు .