2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేక, నిజాయితీతో వ్యవహరించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఒకే మాటపై ఉన్న జగన్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జగన్‌కే అంటూ టాలీవుడ్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఒకసారి ప్రత్యేక హోదా కావాలంటాడు.. మరొకసారి ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? అంటూ ప్రజలనే ప్రశ్నిస్తాడు..? మరొకసారి ప్రత్యేక ప్యాకేజీ కావాలంటాడు..? కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దు అని అంటాదా..? అంటూ ప్రశ్నిస్తాడు. ఎన్నికలు దగ్గరపడుతున్నందున మళ్లీ ప్రత్యేక హోదా కావాలని కొత్త నాటకానికి చంద్రబాబు తెర తీశారని పృథ్వీరాజ్ ఎద్దేవ చేశారు. కానీ జగన్ మాత్రం ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలను సైతం ఎతిరించి తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారన్నారు నటుడు పృథ్వీరాజ్. ప్రధాని మోడీని ఎదిరించిన నిజాయితీపరుడు, మగాడు అంటూ వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.