Home / ANDHRAPRADESH / మంత్రి అఖిల ప్రియ అవుట్ ..ఆందోళనలో భూమా వర్గీయులు ..!

మంత్రి అఖిల ప్రియ అవుట్ ..ఆందోళనలో భూమా వర్గీయులు ..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే షాకిచ్చారు .అందులో భాగంగా ఎప్పుడైతే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి పసుపు కండువా కప్పుకున్నారో ఆ క్షణాన నుండి నేటివరకు భూమా కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.అందులో భాగంగానే దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవిస్తానని పలుమార్లు మాటలు చెప్పి మోసం చేయడంతో మానసిక వేదనతో మరణించారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

అయితే అవన్నీ పుఖార్లు అని నమ్మించడానికి ఏకంగా పార్టీలో ఉన్న నేతలందర్నీ పక్కన పెట్టి మరి జూనియర్ అయిన ఎటువంటి అనుభవం లేకపోయిన కానీ ఆ నిందను తుడుచుకోవడానికి బాబు ఏకంగా మంత్రిగా అఖిలకు ప్రమోషన్ ఇచ్చేశారు.అప్పటి నుండి మంత్రి అఖిలకు ఒకపక్క ఇంటి పోరు..మరోవైపు బాబు పోరు మొదలైంది .ఈ క్రమంలో భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన ఏవీ సుబ్బారెడ్డిను రంగంలోకి దింపి భూమా అఖిలను పక్కన పెట్టడానికి పావులు కదుపుతున్నాడు చంద్రబాబు .ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భూమా అఖిల ,ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గు మనేలా ఉంది .

ఈ క్రమంలో ఇటివల చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమానికి ముందు ఏవీ సుబ్బారెడ్డిని పిలిపించుకొని మరి మీరిద్దరూ కల్సి పని చేయండి.నాకు వచ్చిన పలు సర్వేల నివేదికల ప్రకారం మంత్రి అఖిల ప్రియ గెలిచే అవకాశాలు లేవు .అందుకే నువ్వు నీ పని నువ్వు చేస్కో ..కార్యకర్తల్లో ,ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో ..నీకు ఖచ్చితంగా ఆళ్లగడ్డ టికెట్ ఇస్తాను అని హామీ ఇచ్చాడు అంట బాబు .బాబు ఇలా ఇవ్వడమే భూమా అఖిల కొంప ముంచేలా ఉంది .అదే ఇప్పటికే పార్టీ మారిన తర్వాత మంత్రి పదవివ్వలేదు అని మానసిక క్షోభతో మరణించిన నాగిరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక బాబు మీద ఆగ్రహంగా ఉన్న భూమా వర్గీయులు ప్రస్తుతం ఏవీ సుబ్బారెడ్డిని తెరపైకి తీసుకురావడంతో మరింత ఆగ్రహం ఎక్కువైంది .దీంతో వచ్చే ఎన్నికల్లో అఖిలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు అని ఆమె అనుచరులు వాపోతున్నారు అంట .ఎంతైనా సీనియర్ సీనియరే..జూనియర్ జూనియరే కదా .ఇదే ఏవీ సుబ్బారెడ్డి దెబ్బ అని సుబ్బారెడ్డి వర్గీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat