కాలా, ఫస్ట్ లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండటంతోపాటు రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.సాధారణంగా సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు కబాలి చిత్రంలో సూపర్ స్టార్‌ను ఓ రంజ్‌లో తిరుగులేని డాన్‌గా చూపించిన పా రంజిత్, కబాలి సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన సంతోష్ నారాయణన్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ధనుష్ నిర్మాణ సారధ్యంలో కాలా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో మరింత క్రేజ్‌ను తీసుకొచ్చాయి.
భారీ తారాగణం నడు, భారీ బడ్జెట్‌తో, భారీ హంగులతో నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రూపొందించి ఎమోజీపై అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ధనుష్ ఆలోచనలోనుంచి పుట్టుకొచ్చిన కాలా ఎమోజీ అస్సలు బాగా లేదని, రజనీ కాంత్‌తో సహా అక్షరాలు కూడా అస్సలు కనిపించడం లేదని సోషల్ మీడియాలో నెటిన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.