ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నర హంతకుడు, ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గతంలోనే తెలిపారు..ఏపీ ప్రజలు చంద్రబాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు ఔరంగజేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు అని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. నాకు గవర్నర్ పదవి ఇవ్వమని నేను అడిగానా..? చంద్రబాబు..!! అంటూ మోత్కుపల్లి ప్రశ్నించారు. గతంలో పదేళ్లపాటు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను నీకు అండగా ఉన్నా.. అటువంటి నన్ను నీ అనుచరుల చేత ఎందుకు తిట్టిస్తున్నావు అంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.