ఓ సినిమా జయాపజయాల గురించి తెలియజేయడంలో ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఓవర్సీస్‌లో వసూళ్ల వరదను పారిస్తున్న కొన్ని చిత్రాలు.. చిత్ర నిర్మాణం కోసం ఖర్చు చేసిన బడ్జెట్‌లో అత్యధిక భాగాన్ని ఇట్టే రాబట్టగలుగుతున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన మహానటి చిత్రం కూడా ఈ కోవలో చేరిపోయింది.
అయితే, మహానటి విడుదలై నాలుగు వారాలు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు వారాలు ముగిసే సమయానికి 2.48 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. నిన్నటితో ఈ వసూళ్లు 2.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను మహానటి అందుకుంది. ఒక స్థాయి బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లను రాబట్టగలగడం నిజంగా గొప్ప విషయమనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150, త్రివిక్రహ దర్శకత్వంలో రూపొందిన అఆ చిత్రాలు ఓవర్సీలో రాబట్టిన వసూళ్లను మహానటి దాటేసింది. అయితే, బాహుబలి, బాహుబలి -2, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు చిత్రాలు ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదు చిత్రాలుగా ఉండగా.. ఆరవ చిత్రంగా మహానటి నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా రూపొంది.. అంచనాలకు మించి విజయం సాధించిన మహానటి ఓవర్సీలో అత్యధిక వసూళ్లను సాధించి ఆరవ స్థానంలో నిలవడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే మరీ..!