రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు అయిన వైఎస్ విజయమ్మ ఎంట్రీ ఇచ్చారు.
గతంలో ఎంపీగా పోటి చేసి పరాజయం పాలైన తర్వాత ఆమె ప్రత్యేక్ష రాజకీయాలకు దూరమయ్యారు .అయితే ఇటివల జరిగిన వైసీపీ ప్లీనరీకి హాజరయ్యారు.అప్పటి నుండి మరల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలో ఇటివల వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ద్వారా గతంలో వైసీపీ నుండి బయటకు వెళ్ళిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తిరిగి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు విజయమ్మ ..అయితే గడిచిన పదిరోజుల్లో మూడు సార్లు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను కలిసి తిరిగి వైసీపీలోకి రావాలని విన్నవించారు.
అయితే కొణతాలను పార్టీలోకి తీసుకురావడానికి స్యయంగా విజయమ్మ ఫోన్ చేసి రానున్న ఎన్నికల్లో ఎంపీ సీటు ఇప్పిస్తాను .పార్టీలోకి తిరిగి రావాలని కోరారు.స్వయంగా తన అభిమాన నాయకుడి సతీమణి ,పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫోన్ చేసి రమ్మని కోరడంతో కొణతాల త్వరలోనే వైసీపీ గూటికి వస్తాను అని హామీ ఇచ్చారు అంట .అయితే వైసీపీ పార్టీలో చేరితే అనకాపల్లి ఎంపీ సీటును ఇప్పిస్తా అని విజయమ్మ హామీ ఇవ్వడంతో కొణతాల రాక ఎంట్రీ సులభమైంది అని జిల్లా రాజకీయాలో వార్తలు వస్తున్నాయి ..