వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎనిమిది (కడప, కర్నూలు, అనంతురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల ప్రజలను కలుసుకోవడమే కాకుండా.. వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర 174వ రోజును పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల మధ్యన కొనసాగిస్తున్నారు. అంతేకాక, గత నాలుగు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ దెందులూరులో తన పాదయాత్రను పూర్తి చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ ప్రాంత ప్రజల మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటి..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ ప్రజల ఓటు టీడీపీకా..? వైసీపీకా..? చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందుతాడా..? గెలుపు కోసం టీడీపీ, వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రయత్నాలేమిటి..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..!
మహిళలపై దాడులు, ఇసుక దందా, భూ దందా, ప్రభుత్వ అధికారులపై దాడులు, ఇలా ఎన్నో వ్యవహారాలతో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన పార్టీ ఏదైనా ఉందా..? అంటే టక్కున ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే సమాధానం ఏపీ అధికార పార్టీ.. అందులోని నాయకులే. అలా మహిళలపై, భూ దందా, ఇసుక దందాల్లో టీడీపీ నాయకులు ఆరి తేరారు. అలా అక్రమాలకు, దాడులకు పాల్పడే టీడీపీ నాయకుల్లో మొదటి స్థానం ఎవరిదయ్యా..? అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరే. ఈ విషయాన్ని ఇటీవల ఓ సర్వే సంస్థ వెల్లడించడం గమనార్హం. అంతలా చింతమనేని ప్రభాకర్ తన అనుచరవర్గంతో దెందులూరు నియోజకవర్గంలో రౌడీ రాజ్యాన్ని స్థాపించాడు. అయితే, చింతమనేని ప్రభాకర్ ఎన్ని తప్పులు చేసినా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చూసీ చూడనట్టు వ్యవహరించడం కొసమెరుపు.
అయితే, పై అంశాలన్నిటి దృష్ట్యా 2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఇటీవల దెందులూరులో వైఎస్ జగన్ పాదయాత్రేనని, ఆ పాదయాత్రలో చింతమనేని ప్రభాకర్ జగన్ పాదయాత్రకు హాజరు కావొద్దంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినప్పటికీ.. ఆ బెదిరింపులను సైతం లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రలో దెందులూరు ప్రజలు పాల్గొన్నారు. జగన్ కోసం దెందులూరు ప్రజలు పోటెత్తారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఒక్కసారిగా దడ పుట్టింది.
మరో పక్క దెందులూరు వైసీపీ ఇంఛార్జి కొటారు అబ్బయ్య చౌదరి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలపై నిరంతరం పోరాడటమే కాకుండా.. ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. అంతేకాకుండా, దెందులూరు ప్రజలు రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకోవడం కూడా వైసీపీకి కలిసొచ్చే అవకాశం. పై అంశాలన్నిటిని గమనించిన రాజకీయ విశ్లేషకులు 2019 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందనే భావాన్ని వ్యక్త పరుస్తున్నారు.