2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ ఏపీ శాసనసభాపతి డా.కోడెల శివప్రసాద్ రావు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఒక ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన మొదట్లో.. అంటే 1983లో జరిగిన ఎన్నికల్లో రూ.30వేలు ఖర్చు అయిందని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ రూ.30వేలు కూడా గ్రామాల్లోని ప్రజల నుంచి చందాల రూపంలో వచ్చాయని తెలిపారు. అలా ప్రతీ ఎన్నికల్లోనూ ఖర్చు పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు అయిందని మీడియా ముఖంగా బహిర్గతంగా వెల్లడించారు స్పీకర్ కెడెల శివప్రసాద్ రావు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ జీవితానికి మాయని మరో మచ్చలా తయారయ్యాయి.
అయితే, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఎన్నికల ఖర్చుపై చేసిన వ్యాఖ్యలపై భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన స్పీకర్ కోడెలను అనర్హుడిఆగా ప్రకటించాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కరీంనగర్ కోర్టు స్పీకర్ కోడెలపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతోపాటు జూన్ 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.