శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మసాలా ఆహారాలు తిన్నా, మద్యం సేవించినా శరీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక రకాలుగా సమస్యలు వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా పలు చిట్కాలు పాటిస్తే దాంతో శరీరంలోని వేడిని త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో అర టీస్పూన్ చక్కెర కలిపి ఉదయం పూట పరగడుపునే తీసుకుంటే శరీరంలో వేడి తగ్గిపోతుంది.
2. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకున్నా శరీరంలో ఉండే వేడిని తగ్గించుకోవచ్చు.
3. వెన్న తీసిన మజ్జిగను తీసుకుంటుంటే వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. ఎప్పటికప్పడు చల్లటి నీరు తాగడం వల్ల కూడా శరీరం వేడి నుండి ఉపశమనం పొందుతుంది.
5. రోజులో రెండు లేదా మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు.
6. పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.
7. పుచ్చకాయ తినటం వలన చాలా త్వరగా శరీరంలోని వేడి తగ్గుతుంది.
8. రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే శరీరం చల్లగా ఉంటుంది. వేడి దరి చేరదు.
9. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో తేనె కలిపి రోజూ తాగుతుంటే వేడి బారి నుంచి తప్పించుకోవచ్చు.
10. వంటకాలలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది. ఇవి శరీరంలో వేడి ఏర్పడకుండా చేస్తాయి.