ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ రెండో రోజు మహానాడు సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పార్టీ సీనియర్ నేతలు,మంత్రులు,కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కార్యకర్తలు రాష్ట్ర ప్రజలకు వివరించాలని అన్నారు..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ సీఎం కావడం ఖాయమని…తాత ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తెచ్చే పని ఎప్పటికీ చేయనని లోకేశ్ స్పష్టం చేశారు.2019లో బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఐసీయూలో ఉన్న వైసీపీకి బీజేపీ ఆక్సిజన్ అందిస్తోందని విమర్శించారు.పొరపాటున వైసీపీకి ఎవరైనా ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్టేనని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. తిరుపతి వెంకన్న పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి జోలికి వెలితే మాడి మసైపోతారని ఆయన అన్నారు.