టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు,టాలీవుడ్ సీనియర్ నటుడు ,దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అనంతరం మీడియా ద్వారా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై సంచలన వాఖ్యలు చేశారు.
కమ్మ కులంలో చంద్రబాబు చెడపుట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసమే బాబు వాడుకుంటున్నారని.. ఏపీలో వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు చేతులు కలిపితే… తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా చంద్రబాబు కుట్ర చేశారని… అయితే, కేసీఆర్ తెలివైనవాడు కావడంతో చంద్రబాబు ప్రయత్నాన్ని అడ్డుకోగలిగారని చెప్పారు.