ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట డెబ్బై మూడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.అయితే ఆదివారం ఎండ తీవ్రత గతంలో కంటే ఎక్కువగా ఉండటం ..ప్రజలను
ఎక్కువగా కలవడం ..నిన్న భీమవరం లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో జగన్ కు వడదెబ్బ తగిలింది .వడదెబ్బ తగిలిన జగన్ కాస్త విశ్రాంతి తీసుకొని నేడు సోమవారం నూట డెబ్బై నాలుగో రోజు పాదయాత్రలో పాల్గొన్నారు ..
