తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.తనని నమ్ముకున్నవారు ..ఓట్లేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారనే తెలిస్తే క్షణాల్లో అక్కడ ప్రత్యేక్షమై సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లో చిరునవ్వును చూస్తారు మంత్రి హరీష్ .తాజాగా రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీఎన్ (ఆంధ్రజ్యోతి)డెస్క్ లో సబ్ ఎడిటర్ గా శ్రీనివాస్ పని చేస్తున్నారు .
అయితే అతని సతీమణి గత కొద్ది రోజులుగా కళ్ళ నరాల సమస్యతో బాధపడుతుంది.అయితే కంటి వెనక ఏర్పడిన కణితి తొలగిస్తే ఆమె ఆరోగ్య కుదుటపదుతుందని ..దానికి చాలా ఖర్చు అవుతుంది.ఆపరేషన్ చేయకపోతే కణితి బ్లాస్ట్ అయితే ఆమె ప్రాణాలకు అపాయం అని వైద్యులు తెలిపారు.ఈ సమయంలో అంత డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించే స్థోమత లేదు .అయితే ఈ విషయం గురించి ఒక జర్నలిస్టు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళారు .
దీంతో మంత్రే స్వయంగా శ్రీనివాస్ కి ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ..ఎంత ఖర్చు అయిన ఆపరేషన్ చేయిస్తా ..మీరు ఆపరేషన్ కు సిద్ధం చేస్కొండి ..మీ వైఫ్ కు ఏమి కాదు ..ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తుందని అంటూ భరోసా కల్పించారు మంత్రి .అన్నట్లుగానే ఈ ఆపరేషన్ చేయించేలా మంత్రి స్వయంగా సంబంధిత అధికారులకు లెటర్ రాశారు. ఇవాళ కానీ రేపు కానీ ఆపరేషన్ చేయడానికి అనుమతి వచ్చింది.దీంతో జర్నలిస్తులందరూ మంత్రి హరీష్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు .