పతంజలి గ్రూప్‌తో భారతీయ మార్కెట్‌లోకి వచ్చిన రామ్‌దేవ్ బాబా ఇప్పుడు మరో సంచలననానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌తో కలిసి స్వదేశీ సమృద్ధి పేరుతో సిమ్ కార్డులను తీసుకొస్తున్నారు. పతంజలి సిమ్‌కార్డు ద్వారా దేశ వ్యాప్తంగా అపరమిత ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లను రూ.144లకే పొందొచ్చు. ఈ పథకం పూర్తిగా అమల్లోకి వచ్చిన తరువాత సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారు పతంజలి ఉత్పత్తులపై పదిశాతం రాయితీ పొందొచ్చని ఆయన తెలిపారు.
అంతేకాకుండా, ఈ సిమ్ కార్డు ద్వారా 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల బీఎస్ఎన్ఎల్ కౌంటర్‌ల ద్వారా పతంజలి స్వదేశీ సిమ్ కార్డులను పొందే అవకాశం ఉందని తెలిపారు రామ్‌దేవ్ బాబా.