దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు .ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఎన్టిఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టిఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు, తదితరులు ఆయనకు పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని చెప్పారు . ఎన్టిఆర్ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.ఈరోజు తెలుగు ప్రజలకు పర్వదినం. ఎందుకంటే ఈరోజు అన్నగారి పుట్టినరోజు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంట్లో మాకు ఎన్టీఆర్ లాంటి బిడ్డ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.