ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబునాయుడు వల్లే ఎన్టీఆర్ మరణించారని ఆయన చెప్పారు.తన రాజకీయ జీవితాన్ని బలి తీసుకోవడానికి కుట్రలకు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు చేశారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కెసిఆర్ ను మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏపీలో బాబుకు ఓటెయొద్దని కోరారు. అవసరమైతే తాను ఏపీలో కూడ రధయాత్ర చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. కులాల మధ్య చిచ్చుపెట్టారని బాబుపై నర్సింహులు ఆరోపణలు చేశారు. తీవ్ర బావోద్వేగానికి గురైన నర్సింహులు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
