ఐపీఎల్ సీజన్-11 ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది . ఈ రోజు ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
Innings Break!
After being put to bat first, the @SunRisers post a total of 178/6.
The @ChennaiIPL need 179 to win #VIVOIPL #Final #CSKvSRH pic.twitter.com/pTVdkd42jS
— IndianPremierLeague (@IPL) May 27, 2018
ప్రారంభంలోనే మొదటి వికెట్ కోల్పోయిన హైదరాబాద్ కు కెప్టెన్ విలియమ్సన్ మరోసారి ఆకట్టుకోగా..యూసుఫ్ ఫినిషింగ్ టచ్ తో చెలరేగాడు. హైదరాబాద్ ప్లేయర్లలో ధావన్(26), షకీబ్ (23), విలియమ్సన్(43), యుసఫ్(45), బ్రాత్ వైట్ (21) పరుగులతో రాణించారు.
చెన్నై బౌలర్లలో ఎంగిడి, కర్న శర్మ, బ్రావో, జడేజా, ఠాకూర్ తలో వికెట్ తీశారు.