రషీద్ ఖాన్..ఈ పేరు ఇప్పుడు ప్రపంచంలో మారుమోగుతున్నది.శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన IPL క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రషీద్ చేసిన అద్భుత ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఇటు సోషల్ మీడియా ద్వారా రషీద్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఒంటిచేత్తో హైదరాబాద్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.బ్యాటింగ్ లో 10 బంతుల్లోనే 34 పరుగులు చేసిన రషీద్ బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్ లో రెండు అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. దీంతో రషీద్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా వచ్చిన రూ. 5 లక్షల మొత్తాన్ని, గతవారం ఆఫ్ఘనిస్థాన్ లో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.ఈ ప్రకటనపట్ల తన అభిమానులు హ్యాట్సాఫ్ రషీద్ భాయ్ అంటూ కొనియాడుతున్నారు.
