ఏపీలో అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ,జిల్లా సమన్వయ కర్తగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగ నాధరాజ్ వైసీపీ కండువా కప్పు కున్నారు .
ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నాథ రాజుకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .ఈ మాజీ ఎమ్మెల్యే తో పాటుగా మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ రెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు .ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరంగ నాథ రాజుకు సంబంధించిన అనుచవర్గం వేల మందితో కల్సి వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .. .