మాజీ ప్రధాని ,జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవెగౌడ సంచలన ప్రకటన చేశారు.కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.శాసనసభలో ఖాళీగా ఉన్న జయనగర్, రాజరాజేశ్వరీనగర్, రామనగర నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పొత్తు ఉండదని దేవెగౌడ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.
తొలుత జయనగర్‌ను కాంగ్రెస్‌కు, ఆర్.ఆర్.నగర్‌ను జేడీఎస్‌కు కేటాయించేలా ఉభయపార్టీల మధ్య చర్చలు జరిగిన మాట నిజమేనని, అయితే ఇవి ఫలించలేదని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ఆర్‌ఆర్‌నగర్‌లో జేడీఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్‌లంతా తమ అభ్యర్థి జి.హెచ్.రామచంద్రకు మద్దతుగా నిలబడ్డారని అందువల్ల బరినుంచి వైదొలగే ప్రశ్నే లేదన్నారు. ఈ నిర్ణయం కారణంగా సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్నారు. ఎవరు గెలిచినా సంకీర్ణ ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తుందన్నారు దేవెగౌడ .