తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదివారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు అని సమాచారం .ఈ రోజు ఆదివారం సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రవేశపెట్టిన జోన్ల విషయంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు .అంతే కాకుండా దేశ ప్రధానమంత్రి ,పలువురు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ..
