ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయింది .అయితే పార్టీ కి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు .
ఈ క్రమంలో ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .దశాబ్దాల పాటు కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను అధికారంలో ఉంచడమే కాకుండా ఏకంగా పార్టీ వ్యవహారాల్లో అపార అనుభవం అతని సొంతం .చూడాలి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఈమేరకు పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందో ..!