ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఇంకా భారీ విజయం సాదిస్తున్నది. ఈ చిత్రంలో వచ్చాడయ్యో సామి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో మహేష్ పంచెకట్టులో కనిపించి ప్రేక్షకులకి కనువిందు చేశాడు. తాజాగా 360డిగ్రీల కోణంలో చిత్రీకరించిన సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేశారు.
'Vachaadayyo Saami' Song Making in 360 Degree Video :https://t.co/IgcZqywEh1#BharatAneNenu
— DVV Entertainment (@DVVEnts) May 26, 2018
తాజాగా విడుదలైన వీడియో సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.