అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి ..
తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని నల్బూరి హళ్లి లో తన మిత్రుడి ఇంటికి వచ్చిన సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం నా ఆలోచన అంతా సినిమాలపైనే ఉంది.
ఇప్పటివరకు తెలుగులో మొత్తం తొంబై తొమ్మిది సినిమాలలో నటించాను .ఇతర భాషల్లో మొత్తం ఐదు వందల సినిమాల్లో నటించాను .నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది.నాకు ఆదర్శం మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు .అయితే నేను రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతానో అప్పటి పరిస్థితులను బట్టి చెప్తా అని అన్నారు ..