మీ నగదును బ్యాంకుల్లో దాచుకొని ఉన్నారా..? ఆ నగదుతో ఈ నెల చివర్లో కానీ.. జూన్ మొదటి వారంలో కానీ పని పడనుందా..? అయితే ఇప్పుడే వెళ్లి నగదును డ్రా చేసుకోండి. లేకుంటే మీకు నగదు కష్టాలు తప్పవు. ఇంతకీ మే చివర్లో ఏం జరగనుందీ..? అనేగా మీ డౌట్. అయితే, ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే మరీ.
దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. తమ ఉద్యమానికి మే 30, 31వ తేదీలను ఎంచుకున్నారు. ఈ సందర్బంగా 30, 31వ తేదీల్లో బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఇంతకీ బ్యాంకు ఉద్యోగులు ఎందుకు ఉద్యమించనున్నారంటే..? 2017 అక్టోబర్‌తో ముగిసిన 10వ తేదీన సవరణ ఒప్పందం స్థానంలో.. నూతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ఉద్యమించనున్నారు.