రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతున్న పేరు .నిన్న శుక్రవారం రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిపైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పరుగులతో గెలుపొందిన సంగతి తెల్సిందే .
అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ముందు బ్యాటింగ్ లో రాణించి పది బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులను సాధించడమే కాకుండా ఏకంగా బంతితో రాణించి మూడు వికెట్లను తీయడమే కాకుండా ఒక రన్ అవుట్ ,రెండు క్యాచ్ లను పట్టి తన సత్తాను చాటాడు .దీంతో నెటిజన్లు రషీద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా తనకు వచ్చిన ఐదు లక్షల మొత్తాన్ని గతవారంలో తన సొంత దేశం అప్ఘనిస్తాన్ లో జరిగిన బాంబు పేలుళ్ళలో తీవ్ర నష్ట పోయిన బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించాడు .
పోయిన వారం జలాలాబాద్ లోని స్థానిక క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా సంభవించిన బాంబు పేలుళ్ళలో ఆరుగురు పౌరులు మరణించగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ పై గెలిచిన మ్యాచ్ లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొమ్మును అంతా ఆస్పత్రిలో ఉన్న తన స్నేహితుడికి అందించారు రషీద్ ..