మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది.
అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున షూటింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది చిత్ర బృందం. రంజాన్ మాసాన్ని ముందుగానే ఊహించిన చిత్ర బృందం పక్కా ప్లానింగ్‌తో సాహో చిత్రం షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లిన బృందం.. చిత్రీకరణ పనులన్నింటిని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైంది. అయితే, అదే సమయంలో ఎమిరేట్స్‌కు చెందిన ఒక విమానంలో చిత్ర బృందం తిరుగు పయనమైన సమయంలో ఎయిర్ హోస్టర్స్ ప్రభాస్‌ను చూసి ఆశ్చర్య పోయారు. దీంతో వారంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.