ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కారణంగా ఏదో జరుగుతుందని ఆశించిన మధ్య తరగతికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది.
అయితే ఈ పోల్ కు భారీ స్పందన వచ్చింది.ఈ సర్వేలో దేశ ప్రధాని పగ్గాలు మళ్లీ నరేంద్ర మోదీకే కట్టబెట్టాలని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తం 8,44,646 మంది ఈ పోల్‌లో పాల్గొనగా.. దాదాపు మూడొంతుల (71.9 శాతం) మంది మోదీ వైపే మొగ్గు చూపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే నరేంద్ర మోదీకే ఓటేస్తామని ఎక్కువ శాతం మంది స్పష్టం చేశారు. తమకు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ప్రధాన మంత్రిగా అవసరం లేదని 16.1 శాతం మంది ఓటర్లు ఓటేశారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కేవలం 11.93 శాతం మంది మాత్రమే ఓటేశారు.