మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు.
Delighted to be present here at the 75th year celebration of Telangana Saraswatha Parishath, in Dr. Devulapalli Ramanujarao Kalamandiram, Hyderabad today. pic.twitter.com/QCZaNvxask
— VicePresidentOfIndia (@VPSecretariat) May 26, 2018
తెలుగు భాషాభివృద్ధికి తెలంగాణ సారస్వత పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 75 యేళ్ల ఉత్సవాలలో పాల్గొనడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. తరతరాలుగా భాషా, సంస్కృతులపై దాడులు జరిగాయని. అయినా సారస్వత పరిషత్ తెలుగు భాషా అంతరించిపోకుండా కృషి చేసిందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు పలువురు ప్రముఖులు ఉత్సవాలలో పాల్గొన్నారు.
తెలుగునాట మొట్టమొదట సారి జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించిన ఘనత పరిషత్ కే దక్కింది. పరిషత్ ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డి ఆంద్రుల సాంఘిక చరిత్రకు 1955లో తెలుగులో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. pic.twitter.com/3U8UxBIcMg
— VicePresidentOfIndia (@VPSecretariat) May 26, 2018
పరిషత్తు స్థాపించి 75 ఏళ్ళు గడుస్తున్నా వార్థక్య ఛాయలు దరి చేరనివ్వకుండా, ఎప్పటికప్పుడు నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటూ, ధీటైన సారస్వతానికి పెద్ద పీట వేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు పంచసప్తతి ఉత్సవాలను వీక్షిస్తూ, ఓతెలుగు వాడిగా గర్వపడుతున్నాను. pic.twitter.com/vjgfDJxDlJ
— VicePresidentOfIndia (@VPSecretariat) May 26, 2018