Home / ANDHRAPRADESH / జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో పాల్గొన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా మ‌స్య‌లు తెలుసుకుంటూ.. వాటి ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషిస్తూ ఏపీ భ‌విష్య‌త్ త‌రాల‌ నేత‌గా మ‌రింత గుర్తింపు పొందుతున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌నే. అయితే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గ‌దావ‌రి జిల్లాల్లో కొన‌సాగుతోంది.

అయితే, జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అంతేకాకుండా, ప‌లు సీనియ‌ర్ రాజ‌కీయ నాయుల‌తోపాటు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సైతం జ‌గ‌న్‌కు జై కొడుతున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల కాలంలో అధికార పార్టీతో స‌హా ప‌లు పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు వైఎస్ జ‌గ‌న్ సమ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఇంకా వైసీపీలోకి చేరిక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

ఇక టాలీవుడ్ విష‌యానికొస్తే హీరోలు అక్కినేని నాగార్జున‌, త‌మిళ్ సూప‌ర్ స్టార్ సూర్య‌, అక్కినేని సుమంత్‌, నిఖిల్‌, దాస‌రి అరుణ్ కుమార్‌, కోటా శ్రీ‌నివాస‌రావు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిరంత‌రం పోరాడుతున్న జ‌గ‌న్‌కే జైకొట్టిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా. ఇవాళ 172వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించిన వైఎస్ జ‌గ‌న్‌తో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత పోసాని కృష్ణ ముర‌ళీ క‌లిసి న‌డిచారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ పోసాని న‌డిచారు. తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి జ‌గ‌న్ ఆరా తీశారు. టాలీవుడ్ ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను పోసాని జ‌గ‌న్‌కు వివ‌రించారు. పోసాని చెప్పిన స‌మ‌స్య‌ల‌ను విన్న జ‌గ‌న్‌.. పూర్తిస్థాయి విశ్లేష‌ణ చేసి ప‌రిష్కార దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat