ఊసరవెల్లిలా రంగులు మార్చి ఎప్పటికప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజలను మోసం చేయడంతోపాటు.. అప్పటికప్పుడు ప్రజలు నమ్మేలా పొత్తులు కుదుర్చోవడంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిట్ట అన్న విషయం విధితమే. అవసరానికో అబద్ధం అన్న సామెత ఒక ఎత్తయితే.. వాడుకోవడానికి ఒక మనిషి అన్న నానుడి చంద్రబాబుకు సరిగ్గా సూటవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తనను అప్పటి వరకు నమ్ముకున్న వారిని నట్టేట ముంచడం చంద్రబాబుకు అలవాటే మరీ. పొమ్మనకుండా పొగపెట్టడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అంటూ ఇటీవల కాలంలో ఏపీ ప్రతిపక్షాలు ఆరపించాయి కూడాను.
అయితే, ఇప్పటి వరకు టీడీపీ సమాచార వ్యవహారాల కార్యదార్శిగా ఉన్న పరకాల ప్రభాకర్‌ను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఆ పోస్టును కాస్తా ఎం గ్రూప్‌లో విధులు నిర్వహిస్తున్న సంజయ్ అరోరా అనే ఆయన్ను కొత్తగా సలహాదారుగా నియమించుకున్నారు చంద్రబాబు. అయితే, దీనికంతటికి కారణం కేంద్రమంత్రి నిర్మలా సీతామనే కారణమట. పరకాల ప్రభాకర్ నిర్మలా సీతారామన్ భర్త కావడం, అందులోను బీజేపీ కోవర్టుగా పరకాల ప్రభాకర్‌పై ముద్ర పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పరకాల ప్రభాకర్‌ను పక్కన పెట్టేశారనే గుసగుసలు టీడీపీ వర్గాల్లో వినపడుతున్నాయి.
ఇలా చంద్రబాబు నాయుడు తనపై బీజేపీ కోవర్టు అనే ముద్ర వేయడంతో జీర్ణించుకోలేని పరకాల ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసే పనిలో పడ్డారట. స్వయాన ముఖ్యమంత్రే తనను పక్కన పెట్టడం, ఇకపై టీడీపీలో ఉన్నత పదవులు అధిరోహించడం కూడా కష్టమే అని భావించిన పరకాల ప్రభాకర్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారంటున్నారు టీడీపీ వర్గాలు.