ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీని వీడి కాంగ్రెస్ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిల తెరచాటు భాగోతాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బయటపెట్టారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ భవన్‌లో ఇటీల జరిగిన టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నుంచి టీడీపీకి అన్ని విధాలా నా సేవలు అందించా.. ఆఖరికి కుక్కలా నాడు చంద్రబాబును సీఎం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టించి పనిచేశా. అయినా చివరకు నన్ను ఏకాకిని చేశారు అంటూ సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి ఫైరయ్యారు.
నాడు నా పనితీరును దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మెచ్చుకుని అభినందించి పార్టీలో కొన్ని పనులను అప్పగించారు. కానీ, చంద్రబాబు మాత్రం పార్టీని నమ్ముకున్న వారిని వంచన చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మీటింగ్‌లకు పిలవకుండా అవమానించారన్నారు. ఇలా అయితే, తెలంగాణలోనే కాదు.. ఏపీలోనూ త్వరలో జరనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పారు. చంద్రబాబు సలహా మేరకే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని, కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డి టీడీపీకి కోవర్టులా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోత్కుపల్లి.