ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై సీబీఐ ఎటాక్, సీబీఐ మొదటి ఎటాక్ ఆ ఐదుగురి పైనే. అదేంటి నిప్పునని చెప్పుకునే చంద్రబాబుపై సీబీఐ ఎటాక్ చేయడమేంటి అనుకుంటున్నారా..? అవును, ఇప్పుడు ఏ సీనియర్ జర్నలిస్ట్ బ్లాగ్‌లో చూసినా ఈ వార్తే వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై సీబీఐ ముందుగా డేగ కన్ను ఉంచింది. గత సంవత్సరం రోజులుగా వారిపై నిఘా ఉంచి, వారి అవినీతి కార్యకలాపాలపై దృష్టి సారించిందన్నది సోసల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త సారాంశం.
ఇక అసలు విషయానికొస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వచ్చినన్ని ఆరోపణలు మరే రాష్ట్ర ముఖ్యమంత్రిపై వచ్చి ఉండవన్నది జగమెరిగిన సత్యం. అంతేకాకుండా, ఇటీవల కాలంలో చంద్రబాబు సర్కార్ అవినీతి వల్లే మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు, టీడీపీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అందులోను ఇటీవల గుంటూరు వేదిక పవన్ కల్యాణ్ నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలోనూ చంద్రబాబు సర్కార్ అవినీతిని ఆధారాలతో సహా ఏకిపారేశాడు.
గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపనలపై సీబీఐ గురిపెట్టింది. అయితే, చంద్రబాబు సర్కార్ అవినీతికి సహకరించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులను మొదటగా విచారించి, వారి నుంచి సాక్ష్యాధారాలు సేకరించిన తరువాత రెండో అడుగు వేయాలని నిర్ణయించిందట సీబీఐ. సర్కార్‌పై నేరుగా కేసులు పెడితే ఆధారాలు తారుమారవుతాయని, అందుకే మొదట అవినీతికి సహకరించిన వారిని విచారించి, ఆ తరువాత సర్కార్‌పై చర్యలు తీసుకోవాలన్నది సీబీఐ ఆలోచనగా ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, రోజుకో అవినీతి ఆరోపణతో చంద్రబాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని, సీబీఐ విచారణ చేపడితే నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందని నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.