ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా… ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం అప్రమాత్రం కావడం లేదు .ఇప్పటికే రాష్ట్రంలో మూడు పెద్ద పడవ ప్రమాదాలు చోటు చేసుకోగా.. తాజాగా ఈ రోజు మరొక్కటి జరిగింది.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తుళ్లూరు మండలం బోరుపాలెం ఇసుక రీచ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని తల్లీకూతురుగా గుర్తించారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఓ కుటుంబం చేపల వేట కోసం కృష్ణానదిలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇసుకను తరలిస్తున్న ఓ బోటు వీరి పడవను ఢీకింది. ఈ ప్రమాంలో తల్లీకూతురు నీటిలో మునిగిపోయారు. భర్త ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. మృతి చెందిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. వీరి మృత దేహాలను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ పై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.రాష్ట్రంలో వరుసగా పడవ ప్రమాదాల వలన ప్రజలు మరణిస్తుంటే..ఏ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదంటూ విమర్శిస్తున్నారు.