ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి టీడీపీ మహిళా ఎంపీటీసీ షేక్ రహీమా బేగం, షేక్ హసేనాలను ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పపాదయాత్రలో భాగంగా గురువారం గణపవరం మండలం సరిపల్లి గ్రామం వచ్చిన వైఎస్ జగన్ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో వీరు చేరారు. వీరికి జగనన్న పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఎంపీటీసీ రహీమాబేగం, ఆమె భర్త జిల్లా మైనార్టీ సెల్‌ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ హసేనాలు పదవులతో పాటు తమ పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. ఇటీవల భీమడోలు ఎంపీటీసీ కొల్లి సత్యనారాయణ కూడా పార్టీలో చేరిన విషయం విదితమే. ఎంపీటీసీ దంపతులు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను ఆకర్షితులయ్యామన్నారు. ప్రత్యేక హోదా జగన్ వల్లే సాధ్యమని నమ్మామన్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఖచ్చితంగా 2019 లో ఆంధ్రన్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అంటున్నారు.