గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలస వస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా 27న వైఎస్సార్ సీపీలో చేరతానని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 27న భీమవరం నియోజకవర్గం చిన అమిరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
