కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు ఇటివల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కుమార స్వామీ నేతృత్వంలోని కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వం బల నిరూపణకు దిగింది.అంతకంటే ముందు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.అయితే ఈ ఎన్నిక జరిగే ముందు స్పీకర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ జేడీఎస్ మిత్రపక్షాల నుండి రమేష్ కుమార్ ,బీజేపీ పార్టీ తరపున
సురేష్ కుమార్ బరిలోకి దిగారు.
అయితే ఎన్నిక జరగకముందే బీజేపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థి తప్పుకోవడంతో కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థి స్పీకర్ గా ఎన్నికయ్యారు .అయితే ఐదో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .అయితే గతంలోని 1994నుండి 1999వరకు రమేష్ కుమార్ స్పీకర్ గా పని చేశారు ..